PREZ OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Tirupati, 20 November 2025: The Honourable President of India, HE Smt. Droupadi Murmu, offered prayers in Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Thursday evening.

Upon reaching the temple, the Honorable President of India was welcomed by the AP Ministers Sri Anam Rama Narayana Reddy, Smt. Vangalapudi Anitha, TTD EO Sri Anil Kumar Singhal, AP Endowments Secretary Sri Hari Jawahar Lal, District Collector Dr Venkateswar, District SP Sri Subbarayudu, JEO Sri Veerabrahamam, CV&SO Sri Muralikrishna. 

Later, the temple priests offered the traditional Swagatam to the first citizen of the Nation.

The Honorable President offered prayers to  the temple Dhwajasthambham and later had darshan of the presiding deity of Sri Padmavati Ammavaru. 

Later, in the Ashirwada Mandapam, she was offered Prasadam. On the occasion she was honored with a Sesha Vastram and the photo of the deity is presented. 

Among others Chandragiri MLA Sri Pulivarthi Nani, Anantapur DIG Semushi Ghosh, TTD Board Member Sri Bhanuprakash Reddy, Temple Deputy EO Sri Harindranath and others participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

తిరుపతి, 2025, నవంబర్ 20: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వేంకటేశ్వర్ , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ,  స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. 

అనంతరం గౌరవ రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, 

ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గౌరవ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు. 

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, అనంతపురం డిఐజీ సీమోషీ ఘోష్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో

శ్రీ హరీంద్రనాథ్,  అర్చకులు శ్రీ బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.