PREZ TO VISIT TIRUMALA _ భారత రాష్ట్రపతి తిరుమల పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
Tirumala, 06 November 2025: Her Excellency the Honourable President of India, Smt Droupadi Murmu will offer prayers in the hill shrine of Sri Venkateswara Swamy on November 21.
During her two-day visit to the pilgrim centre, the President will initially offer prayers at Sri Padmavati Ammavaru temple in Tiruchanoor on November 20 and later reach Tirumala.
Following the temple tradition, the President will offer prayers in Sri Varaha Swamy temple on November 21 followed by Sri Venkateswara Swamy.
In this connection, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary held a review meeting with the officials in Tirumala on Thursday along with the CV & SO Sri Muralikrishna at the meeting hall of Sri Padmavati Rest House.
Hr instructed the officials concerned to make necessary arrangements in view of the two day visit of the first citizen of India in a meticulous manner.
CEO SVBC Sri Phani Kumar Naidu, CE Sri Satyanarayana, Additional SP Sri Ramakrishna besides several other officials of TTD were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భారత రాష్ట్రపతి తిరుమల పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 06 నవంబర్ 2025: భారత దేశ గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబరు 21వ తేదీన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు.
తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా, పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు.
ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ శ్రీ ఫణికుమార్ నాయుడు, సిఈ శ్రీ సత్యనారాయణ, అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



