PRIME MINISTER OF MAURITIUS OFFERS PRAYERS IN SRIVARI TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
Tirumala, 15 September 2025: The Honourable Prime Minister of Mauritius, Sri Navinchandra Ramgoolam had darshan of Sri Venkateswara Swamy at Tirumala on Monday evening along with his family and entourage.
On his arrival at the temple he was accorded a warm welcome by State Endowments Minister Sri Anam Ramanarayana Reddy, TTD Chairman Sri B.R. Naidu, and TTD EO Sri Anil Kumar Singhal.
After offering prayers at the Dwajasthambam, the PM of Mauritius had darshan of Sri Venkateswara Swamy.
Later, at the Ranganayakula Mandapam, Vedic scholars rendered Veda Asheervachanam, followed by the presentation of Tirtha Prasadams,, photo of Srivaru by the Chairman and EO.
TTD Board Ex-officio Member Sri Divakar Reddy, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, CV&SO Sri Muralikrishna, and other officials were also present on this occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
తిరుమల, 2025 సెప్టెంబర్ 15: మారిషస్ దేశ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు.
ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ex- officio బోర్డు సభ్యులు శ్రీ దివాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.















