PRINCIPAL SECRETARY AND FOUR OTHERS TAKES OATH _ టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా శ్రీ‌మ‌తి జి.వాణి మోహ‌న్, స‌భ్యులుగా మ‌రో న‌లుగురు ప్రమాణస్వీకారం

TIRUMALA, 20 SEPTEMBER 2021:  The Principal Secretary and the Commissioner of Endowments Department of Andhra Pradesh Smt G Vani Mohan took oath as Ex-officio member of TTD Trust Board in both the capacities in Srivari temple at Tirumala on Monday.

The Additional EO Sri AV Dharma Reddy administered the oath of office at Bangaru Vakili. Later she had darshan of Sri Venkateswara Swamy followed by Vedasirvachanam at Ranganayakula Mandapam. The Additional EO presented her Theertha Prasadams, laminated photo of Srivaru and Coffee Table book. 

Sri Jeevan Reddy, Sri M Ramulu, Sri K Rambhupal Reddy, Sri B Lakshminarayana also took oath as TTD Trust Board members in Tirumala on Monday.

They were rendered Vedasirvachanam and offered Theertha Prasadams, Srivari Photo and coffee table book by Additional EO.

Deputy EOs Sri Ramesh Babu, Sri Lokanatham, Smt Sudharani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా శ్రీ‌మ‌తి జి.వాణి మోహ‌న్, స‌భ్యులుగా మ‌రో న‌లుగురు ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 20: రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ మ‌రియు క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి జి.వాణి మోహ‌న్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా, శ్రీ జీవ‌న్‌రెడ్డి, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీ బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ స‌భ్యులుగా సోమ‌వారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) శ్రీమతి సుధారాణి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.