PROCESSION OF SWARNA RATHAM HELD _ స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు
Tirumala, 23 September 2023: On the sixth day evening of the ongoing Srivari Salakatla Brahmotsavams in Tirumala, TTD observed Swarna Rathotsavam (the festival of the Golden chariot) on Saturday between 4pm and 5pm.
Sri Malayappa Swamy gave darshan to His devotees in a grand manner along with Sridevi and Bhudevi.
Devotees especially women participated with enthusiasm to pull the cart all along the four mada streets chanting Govinda Namas.
The TTD EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు
తిరుమల, 2023 సెప్టెంబరు 23: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం
స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు శ్రీ మతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.