PROCESSION OF SWARNA RATHAM HELD _ స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

Tirumala, 11 April 2025: On the second day of the ongoing annual Vasanthotsavam in Tirumala, Sri Malayappa along with Sridevi and Bhudevi, took out a celestial ride on the Golden Chariot.
 
The deities blessed devotees along the Mada streets between 8am and 10am.
 
TTD Trust board members Sri Jyothula Nehru, DyEO Sri Lokanatham, VGO Sri Surendra and others were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

తిరుమల, 2025 ఏప్రిల్ 11: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.