PROTECT NATURE FOR GOOD OF HUMANITY- TTD CHAIRMAN _ ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ

* HIGHLIGHTS TTD INITIATIVES FOR ENVIRONMENTAL PROTECTION AT TIRUMALA ON WORLD ENVIRONMENT DAY 

* FOCUS ON MAKING TIRUMALA AS A GREEN & POLLUTION FREE HUB

* APPEALS TO EVERYONE TO PLANT TREES AND STOP POLLUTING AIR, WATER & SOIL

 

Tirumala, 05 June 2022: TTD Chairman Sri YV Subba Reddy said on Sunday that the protection of nature was the only solution to save humanity from the severity of global warming.

 

In a statement on the occasion of World Environment Day celebrations, the TTD Chairman highlighted the various measures initiated by TTD to combat global warming and environmental protection at Tirumala.

 

Greeting people on the occasion the TTD Chairman underscored the significance of the complete plastic ban that has been implemented from June 1 in all the shops, hotels and checkpoints from Alipiri to Tirumala.

 

Among others he referred to the introduction of 100 electric buses by RTC for daily Tirupati-Tirumala transport, use of jute and bio-degradable bags for Srivari laddu Prasadam, sacred flower gardens to provide a divine and serene environment to devotees, promoting organic farming without pesticides and Srivari Naivedyam with organic rice jaggery, pulses etc. and finally planting 10,000 saplings all around Tirumala.

 

TTD Chairman said in near future many more organic decisions will be made by the TTD board to further the case of environmental protection against global warning.

 

He gave a clarion call to all Srivari devotees not to pollute soil, air and water as part of their dedication to Sri Venkateswara and to take up planting of saplings wherever and whenever possible.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ

– తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నాం

– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, నేల, నీరు, గాలిని కలుషితం చేయొద్దు

– ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 5 జూన్ 2022: గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ప్రజలకు ఒక ప్రకటన లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత మూడేళ్ళలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న అనేక నిర్ణయాల గురించి శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులోభాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించామన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాన్ని రెండేళ్ళ కిందటే నిషేధించామని చెప్పారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా గాజు బాటిళ్లు ఏర్పాటు చేయించడంతో పాటు తిరుమలలోని అన్ని ప్రాంతాలు, అతిథి గృహాల్లో జల ప్రసాదం అందుబాటులో ఉంచి భక్తులకు సురక్షిత తాగునీరు అందిస్తున్నామన్నారు. చైర్మన్ నుంచి సామాన్య భక్తుడి వరకు ఈ నీరే తాగుతున్నారని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి కొండమీద హోటళ్లు, ఇతర దుకాణాల్లో కూడా ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ వాడరాదని ఆదేశారు జారీ చేసి అమలు చేస్తున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

అదేవిధంగా అలిపిరి టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేసి వాటర్ బాటిళ్లు తీసేస్తున్నారన్నారు. భక్తులు కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తిరుమల లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించామని, త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలో ప్లాస్టిక్ బ్యాగ్ లు నిషేధించామని, వీటి స్థానంలో జ్యుట్, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగ్ లు అందుబాటులోఉంచామన్నారు.తిరుమలకు వస్తున్న భక్తులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత వాతావరణం, పర్యావరణ పరిరక్షణ చర్యలు పెంపొందించే విధంగా ఉద్యాన వనాలు అభివృద్ధి చేస్తున్నాము.

నేల తల్లిని కాపాడుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయన తెలిపారు. ఇందులోభాగంగా రైతులురసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో రైతుసాధికార సంస్థ తో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన సెనగలు, బియ్యం, బెల్లం టీటీడీ కొనుగోలు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రజలు నేల తల్లిని, నీటిని, గాలిని కలుషితం చేయకుండా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి సమాజ భవిష్యత్తు కు పాటుపడాలన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది