PROTECT TIRUMALA GHAT ROADS FROM LANDSLIDES- TTD EO _ ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలి

ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలి

– కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలపై ఈవో సమీక్ష

తిరుమల, 2022 మే 01: ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన అమృత విశ్వవిద్యాలయం నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు వీలైనంత త్వరగా తిరుమల ఘాట్ రోడ్ల పై సమగ్ర నివేదిక అందించాలన్నారు. తిరుమలలో సంభవించే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అమృత విశ్వవిద్యాలయం నిపుణులను కోరారు. అదేవిధంగా విపత్కర పరిస్థితులను ముందస్తుగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా మాతా అమృత విశ్వవిద్యాలయం నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ లు మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ల లో ఎక్కడెక్కడ మట్టి మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అనే విషయాలు గుర్తించాలన్నారు. వర్షాలు సంభవించినప్పుడు వర్షపు నీరు వెళ్లేలా కల్వర్టులు ఏర్పాటుచేసి డ్రైనేజ్ సిస్టం మరింత మెరుగు పర్చాలని సూచించారు. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు వాలుగా ఉందని, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తినప్పుడు లింక్ రోడ్డును ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే విషయాన్ని వారు వివరించారు.

ఈ సమీక్షలో అదనపు ఈవో శ్రీ ఏ.వి ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వర రావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 01 May 2022: TTD EO Dr KS Jawahar Reddy said all out efforts should be made to ensure advance warning on landslides etc. on Tirumala Ghat roads and prevent human and material loss.

 

Reviewing with officials and interacting with experts of Amrut University via virtual meeting from his chambers in TTD Administrative Building on Sunday the EO said the comprehensive report from the strategic research and innovations wing of Amrut University should be expedited.

 

He asked the university experts to submit action plans ahead of calamities and also develop infrastructure to face challenges.

 

Professor Manisha and Prof.Sudesh Vidhwan of Amrut university said studies be made to identify the soft and hard surfaces in the Tirumala Ghat roads and culverts cum drainage system to strengthen to ensure quick discharge of rainwaters.

 

They said the second Ghat road was slanted and also how the Link Road be utilised during thundershower season.

 

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeeshwar Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI