PROTEIN POWDER FOR TIRUMALA VEDA PATHASHALA STUDENTS _ తిరుమ‌ల వేద పాఠశాల విద్యార్థుల‌కు ప్రోటీన్ పౌడ‌ర్

Tirumala, 13 Mar. 21: The students of Dharmagiri Veda Pathashala on Saturday evening provided Protein powders of generic make worth Rs. 45,000 donated by the generic medical outlet at the SVIMS hospital.

The donors said on the directions of TTD Chairman Sri YV Subba Reddy they distributed the nutritious protein powder to students to consume the milk daily which improvises the immunity power.

Generic medical stall owner at SVIMS Sri Ravi Kumar, Sri Murthy and Prasanna were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల వేద పాఠశాల విద్యార్థుల‌కు ప్రోటీన్ పౌడ‌ర్  
 
 తిరుమల, 2021 మార్చి 13: తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థుల‌కు తిరుప‌తిలోని స్వీమ్స్ జ‌నరిక్ మెడిక‌ల్ షాపువారు రూ.45 వేలు విలువైన జ‌న ఔష‌ధి ప్రోటీన్ పౌడ‌ర్‌ను శ‌నివారం సాయంత్రం అందించారు.

టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల‌కు, ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాప‌కుల‌కు, విద్యార్థుల‌కు అందించారు. దీనిని పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల‌న శ‌రీరంలో హ్యూమినిటి పెరుగుతుంద‌ని దాత‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌నరిక్ మెడిక‌ల్ షాపు ప్రొప్రైట‌ర్ శ్రీ ర‌వికుమార్‌, ఇంచార్జ్ శ్రీ మూర్తి, శ్రీ ప్ర‌స‌న్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది