PROVIDING HASSLE FREE DARSHAN TO DEVOTEES IS OUR PRIME GOAL-TTD EO _ భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మ‌న‌ ధ్యేయం :- స్వ‌తంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

PATRIOTISM AND PIETY ARE INTERLINKED

TIRUMALA, 15 AUGUST 2024: Stating that Patriotism and Piety are inextricably interlinked, TTD EO Sri J Syamala Rao advocated that providing hassle-free darshan to the tens of thousands of devotees visiting Tirumala temple from across the globe is the numero uno goal of TTD.

In his I-Day speech on the occasion of the 78th Independence Day celebrations after unfurling the National Flag in TTD Parade Grounds in Tirupati on Thursday, the EO said, taking the inspirational path laid by our great National leaders, TTD is also sanctifying in the service of devotees from the past several decades since its inception. “Bringing reforms in the larger interests of the pilgrims, is a never ending process in TTD as it keeps on changing keeping in view the majority needs of the devotees according to the time”, he observed.  

For the benefit of the common pilgrims, we have restricted the SRIVANI Seva online quota to 1000 and enhanced the SSD tokens, to avoid long waiting hours for pilgrims. We have also improved the quality and taste of Laddu Prasadams, Annaprasadams and also ensured continuous supply of food and milk distribution to the pilgrims in the compartments and queue lines.

To upkeep the Tirumala environs clean and green, the sanitation measures have also been enhanced, the hotels and eateries in Tirumala are instructed to serve qualitative and affordable delicacies to visiting pilgrims. All these measures are a continuous process and the ultimate goal is to provide a comfortable stay, hassle free darshan and a memorable pilgrimage experience to devotees visiting Tirumala. 

To achieve this goal, the EO called upon the entire TTD workforce to render more dedicated services to the devotees with team spirit and take forward the fame of the institution on a global level.

JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CEO SVBC Sri Shanmukh Kumar, Additional CVSO Sri Siva Kumar Reddy, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, CPRO Dr T Ravi, other officials, employees were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మ‌న‌ ధ్యేయం :

– మరింత సేవాభావంతో భక్తులకు సేవలందిద్దాం

– స్వ‌తంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

తిరుపతి, 2024 ఆగష్టు 15: ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో సేవలందించాల‌ని ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. భారత స్వ‌తంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఘనంగా జరిగాయి.

టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈవో మాటల్లోనే….
అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తుచేసుకుని వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం.

దేశభక్తికి దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మ స్ఫూర్తితోనే యువతకు దిశానిర్థేశం చేశారు. సనాతన భారతీయ సంస్కృతిని పునరుజ్జ్జీవింప చేయడమే దేశభక్తిగా, దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారు. ‘‘యువతా మేలుకో’’ అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు.

జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మపథాలైన సత్యం, అహింస స్ఫూర్తితో అవే ఆయుధాలుగా చేసి, ఒక రక్తపు చుక్క చిందించకుండా శాంతి యుతంగా పోరాటం చేసి స్వాతంత్య్రన్ని సాధించి పెట్టారు. ఇలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.

జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులమైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తిసామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీవేంకటేశ్వరస్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.

– టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.

– ఈ ఏడాది అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

– సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్‌ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించాం.

– శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో జారీ చేస్తున్నాం.

– తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా తిరుమలలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు హోటల్స్‌ వారికి అవసరమైన ట్రైనింగ్‌ ఇస్తున్నాం.

– క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు అప్పగించాం.

– భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం.

– శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.

– ఇటీవల కాలంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కొంతమంది మధ్యవర్తులు ఎక్కువసార్లు పొందినట్లు గుర్తించాము. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కావున భక్తులు ఇటువంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నాం.

– శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యం. టీటీడి నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.

– తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కోనుగొలు చేసేందుకు చర్యలు చేపట్టాం.

– తిరుమల స్వచ్ఛతకు మారుపేరు. తిరుమలలో పరిశుభ్రతను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం.

– టిటిడి ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం.

– గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.59 లక్షలు ఇస్తున్నాం, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం.

– తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలతో పాటు ఇతర టిటిడి స్థానిక ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేదిశగా కృషి చేస్తున్నాం.

– సనాతన హిందూ ధర్మప్రచారాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో భాగంగా టీటీడీ హిందూ ధార్మికప్రాజెక్టులను కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. హిందూ ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్యప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు, ఆళ్వార్‌ మరియు నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణంప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలతో హిందూ ధర్మప్రచారాన్ని అత్యంత విస్తృతంగా ముందుకు తీసుకెళుతున్నాం.

– ప్రతి ఏడాదీ టిటిడి ప్రతిష్టాత్మకంగా డైరీలు, క్యాలెండర్లు ముద్రిస్తోంది. ఇందులో భాగంగా 2025వ సంవత్సరానికి గాను 33 లక్షల క్యాలెండర్లు, డైరీలు ముద్రిస్తున్నాం.

– టిటిడి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన, వసతి, భోజన ఇతర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం బాగా పెరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం.

– టిటిడిలోని మొత్తం 33 విద్యాసంస్థల్లో దాదాపు 19 వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాం. వారికి మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నాం.

– శ్రీవారి సేవలో గడిచిన 24 సంవత్సరాల్లో ఇప్పటివరకు 15.70 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొని భక్తులకు విశేష సేవలందిస్తున్నారు.

– ఎక్కువమంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని, తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు విశేష సేవలు అందించాలని పిలుపునిస్తున్నాం.

– ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు సేవలందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల కృషి అభినందనీయం. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

– ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్తజనావళికి సేవలందించాలని కోరుతున్నాను.

– రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు సేవలందిస్తున్న అర్చకులకు, టిటిడి అధికారులు, ఉద్యోగులు, భద్రతాసిబ్బంది, పొరుగు సేవల సిబ్బంది, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారిసేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

– టీటీడీ ఇతర ధార్మిక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, సర్వజగద్రక్షకుడైన శ్రీవేంకటేశ్వరుడు యావత్‌ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను….జైహింద్‌

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్, డిఎల్‌వో శ్రీ వర ప్రసాద్ రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, విజివో శ్రీ నంద కిషోర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.