PUJA HELD AT GARDEN OFFICE _ తిరుమల ఉద్యానవన కార్యాలయంలో పుష్పాలకు పూజలు

TIRUMALA, 11 NOVEMBER 2021: In connection with Pushpayagam on Thursday evening, special puja was performed to the flowers at the Garden Office in Tirumala.

 
About seven tonnes of various varieties of flowers were rendered puja.

 

Garden Deputy Director Sri Srinivasulu, Health officer Dr Sridevi, Field Officer Smt Madhavi, flower donors, other staff members from the Garden department, Srivari Sevakulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల ఉద్యానవన కార్యాలయంలో పుష్పాలకు పూజలు

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 11: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన సుమారు ఏడు టన్నుల వివిధ రకాల పుష్పాలకు గురువారం ఉద‌యం ఉద్యానవన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీమతి మాధవి, పూల దాతలు, ఉద్యానవన శాఖ సిబ్బంది, శ్రీవారి సేవకులు తదితరులు పాల్గొన్నారు.

వేడుక‌గా స్న‌ప‌న తిరుమంజ‌నం

శ్రీ‌వారి ఆల‌యంలో పుష్పయాగం సంద‌ర్భంగా గురువారం ఉద‌యం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. అక్క‌డ స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.