PUJA PERFORMED _ వైభవంగా అక్కదేవతల కార్తీకమాస పూజ
Tirumala, 24 November 2023:The Transport wing of TTD on Friday performed the Karthika Masa Puja at Akka Devatas temple on the first ghat road.
It is a well-known tradition of performing such puja by TTD drivers and locals at Akka Devatas temple annually seeking safe journeys for devotees and drivers as well.
TTD Transport wing officials and locals participated in the puja.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా అక్కదేవతల కార్తీకమాస పూజ
తిరుమల, 2023 నవంబరు 24 ; తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు.
అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రవాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.