PULSE POLIO PROGRAMME HELD IN TIRUMALA _ తిరుమలలో పల్స్ పోలియో
2129 CHILDREN ADMINISTERED POLIO DROPS
Tirumala, 21 December 2025: As part of the Nation-wide initiative, the Pulse Polio administration programme was launched on Sunday in front of Tirumala Temple.
The TTD Chief Medical Officer, Dr. B. Kusuma Kumari, administered polio drops to children to mark the commencement of the programme.
A total of 25 Pulse Polio centres have been set up across Tirumala—21 centres for devotees (including the temple) and 4 centres for local residents. From 7am to 5pm a total of 2,129 children were administered polio drops.
Senior Medical Officer Dr. S. Kusuma Kumari, Ashwini Hospital Medical Superintendent Dr. Venkata Subba Reddy, Tirupati Central Hospital Medical Superintendent Dr. Suharlatha, Ashwini Hospital Nursing Superintendent Smt. Krishna Kumari, along with other doctors and paramedical staff, participated in the programme.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో పల్స్‌పోలియో
2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు
తిరుమల, 2025 డిసెంబర్ 21: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.కుసుమ కుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ముఖ్య వైద్యాధికారి కోరారు.
కాగా అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 మరియు 2, హెల్త్ ఆఫీసు, ఎటిసి, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్.వి. హైస్కూల్, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.కుసుమకుమారి, అశ్వినీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, తిరుపతి సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుహర్లత, అశ్వినీ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి కృష్ణ కుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.



