PURADHARA DASA ARADHANA FESTIVAL CONCLUDES _ ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

Tirumala, 19 January 2026: Kannada Sangeeta Pitamaha Sri Purandardasa Aradhana Mahotsavams, observed under the auspices of the Dasa Sahitya Project of TTD concluded in Tirumala on a grand note on Monday at Asthana Mandapam.

The Special Officer of the Dasa Sahitya Project, Sri Ananda Theerthacharyulu, said  Sri Purandara Dasa who was actually the incarnation of Narada, penned and composed 4.75 lakh Sankeertans during his lifetime.  

He said Purandardasa’s hymns are universal and immortal. The life of Sri Purandardasa is exemplary for humanity, he maintained.

Thousands of Bhajan Mandali members from the states of Andhra, Telangana and Karnataka participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

తిరుమల, 2026 జనవరి 19: తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూమాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారుదీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మహాత్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

అదేవిధంగా శ్రీ‌ తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుల వారికే సాధ్యమైందని తెలిపారుపురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారుమానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.

 కార్యక్రమంలో ఆంధ్రతెలంగాణకర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.