PURANDARA DASA ARADAHANOTSAVAM HELD _ అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirupati, 23 January 2020: In an musical tribute 400 bhajan mandali artists from both Telugu states have presented the sankeertans of Kannada Sangeetha Pitamaha Sri Purandara Dasa on Thursday in Tirupati.
 
From 8am till 8pm they will sing in groups as a part of the Aradhana Mahotsavams of Sri Purandhara Dasaru.
 
The Special Officer of the Dasa Sahitya Project Sri Anandathirthacharyulu participated in the day long event.
 
Pushpanjali at Alipiri on January 24
 
On January 24, the statue of Sri Purandara Dasa near Alipiri will be garlanded on the occasion. Later on bhajan artists will present Haridasarasa Ranjani,  a Bhakti sangeet Program at the Annamacharya Kala Mandir from 8am till 12 noon followed by religious discourses.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
 
    

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుప‌తి, 2020 జ‌న‌వ‌రి 23: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు గురువారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన 400 మందికిపైగా భ‌జ‌న మండ‌ళ్ల క‌ళాకారులు శ్రీ పురంద‌రదాస కీర్త‌న‌ల‌ను చ‌క్క‌గా ఆల‌పించారు. ఉద‌యం 8 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు బృందాల వారీగా క‌ళాకారులు దాస ప‌దాల‌ను గానం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జ‌న‌వ‌రి 24న అలిపిరిలో పుష్పాంజ‌లి

ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా జ‌న‌వరి 24న శుక్ర‌వారం ఉదయం 6 గంటలకు అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు హ‌రిదాస‌రంజ‌ని క‌ళాకారుల‌తో సంగీత కార్య‌క్ర‌మం, పండితుల ధార్మికోప‌న్యాసాలు, పురంద‌ర‌దాస సంకీర్త‌న విభావ‌రి త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.