PURANDHARA DASA FETE HELD _ వైభ‌వోత్స‌వ మండ‌పంలో శ్రీపురందరదాసుల సంకీర్తనాలాపన

TIRUMALA, 01 FEBRUARY 2022: The Purandhara Dasa Aradhanotsavams was observed with utmost devotion in Tirumala on Tuesday evening in Vaibhavotsava Mandapam with the artists rendered umpteen number of Sankeertans penned by the Kannada Saint Poet.

 

This event was held under the aegis of the Dasa Sahitya Project of TTD in the supervision of its Special Officer Sri PR Anandatheerthacharyulu.

 

When the artists were rendering Sankeertans, another set of artistes portraying various mythological characters performed dance ballet in the divine presence of Sri Malayappa with Sridevi and Bhudevi on Unjal.

 

Potu Peishkar Sri Srinivasulu, Parupattedar Sri Uma Mahaeswara Reddy and other temple staff were present.

 

The programme lasted nearly for two hours between 6pm and 8pm which was telecasted live on SVBC for the sake of global devotees.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభ‌వోత్స‌వ మండ‌పంలో శ్రీపురందరదాసుల సంకీర్తనాలాపన

తిరుమల, 2022 ఫిబ్రవరి 01:  శ్రీ పురందరదాసుల ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీవారి ఆలయం వ‌ద్ద‌గ‌ల వైభ‌వోత్స‌వ మండ‌పంలో భజన మండళ్ల కళాకారులు శ్రీ పురంద‌ర‌దాస సంకీర్తనల బృంద‌గానం నిర్వ‌హించారు. ఈ సంకీర్తనలు ఆద్యంతం భక్తిభావాన్ని పెంచాయి. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం చేసింది.

వైభ‌వోత్స‌వ మండ‌పంలో శ్రీదేవి‌, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో భజన మండళ్ల కళాకారులు పలు దాస సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు పౌరాణిక వేషధారణలతో సంకీర్తనలకు అనుగుణంగా నృత్యం చేశారు.

కాగా, శ్రీ పురందరదాసుల ఆరాధ‌నోత్స‌వాల్లో చివరి రోజైన ఫిబ్ర‌వ‌రి 2న బుధవారం తిరుమల ఆస్థానమండపంలో భజన కార్యక్రమాలు, నగర సంకీర్తనం త‌దిత‌ర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో విజిఓ శ్రీ బాలిరెడ్డి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, పారుపత్తేదార్ శ్రీ ఉమా మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.