PUSHKARINI TURNS INTO A SEA OF HUMANITY _ వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

TENS OF THOUSANDS CONVERGE FOR PANCHAMI THEERTHAM

PUSHPAYAGAM ON DECEMBER 07

TIRUPATI, 06 DECEMBER 2024: The temple tank at Tiruchanoor turned into a Human Sea with scores of devotees taking a holy bath in Padma Sarovaram on the auspicious day of Panchami Tithi on Friday.

The entire pilgrim centre was caught in devotional waves with the devotees chanting Govinda Namas with spiritual ecstasy.

SNAPANA TIRUMANJANAM 

Under the leadership of Kankanabhattar Sri Srinivasacharyu, a celestial eremony was held from 10 am to 11.45 am for the Utsava deity of Sri Padmavati Devi and Sri Sudarshana Chakratthalwar in the Panchami Tirtha Mandapam.  

On this occasion, the utsava murthies were anointed with milk, curd, honey, coconut water, turmeric and sandalwood.  Several tastefully prepared garlands and crowns decorated the Goddess during the ritual providing a delightful feast to the eyes of the devotees.

Garlands made of Black grapes, Cuscus, Seeds stood as a special attraction. While the Panchami Thirtha Mandapam was decorated with various cut flowers and Australian Oranges. These garlands were donated by donors from Tirupur of Tamilnadu.

Both the Pontiffs of Tirumala, Chairman Sri BR Naidu, EO Sri Syamala Rao and a galaxy of top brass officials of TTD and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

– క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌ తిరుమంజ‌నం

– పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయుత్వం చెందిన భక్తులు

తిరుప‌తి, 2024 డిసెంబ‌రు 06: శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.

ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.

అమ్మవారికి శ్రీవారి కానుక

శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బ‌రువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నక్లెస్, రెండు డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా సిరుల తల్లి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

కంకణబట్టర్
శ్రీ శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 నుండి 11.45 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.

వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టి వేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెడల్స్, తులసి మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. త‌మిళ‌నాడులోని తిరుపూర్‌కు చెందిన దాతలు ఈ మాల‌లను విరాళంగా అందించారు.

ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం

పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇందులో ఆస్ట్రేలియా ఆరంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25 వేల కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

ఉదయం 12.15 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30 గంటలకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్
శ్రీ బి.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు దంపతులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎంఎల్‌ఏ శ్రీ పులివ‌ర్తి నాని, బోర్డు స‌భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, నన్నపనేని సదాశివరావు, ఎస్. నరేష్ కుమార్, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌత‌మి, సివిఎస్‌వో శ్రీ శ్రీ‌ధ‌ర్‌, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏవీఎస్వో సతీష్ కుమార్, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సుభాష్, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డిసెంబ‌రు 7న పుష్పయాగం

డిసెంబరు 7వ తేదీ శ‌నివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది