PUSHPAYAGAM HELD AT VONTIMITTA _ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

VONTIMITTA, 19 APRIL 2022: Annual Pushpayagam was held with religious fervour in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district on Tuesday evening.

 

This fete was observed between 6pm and 9pm where in several tonnes of traditional, ornamental flowers and leaves were used to render Pushpabhishekam to the processional deities.

 

The devotees witnessed this unique fete with utmost veneration.

 

Temple special officer Sri Ramaraju, AEO Sri Subramanyam, Superintendent Sri Venkatesaiah, Temple Inspector Sri Dhananjaya and archakas were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్‌ 19: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.

సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటల వరకు వేడుకగా జరగనుంది. తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.