PUSHPAYAGAM HELD IN A SPLENDID MANNER _ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

VONTIMITTA, 09 APRIL 2023: The annual Pushpayagam, the ritual of flowers was observed in a splendid manner at Vontimitta Sri Kodandarama temple on Sunday evening.

 

About 2.5tonnes of flowers including 11 varieties of various flowers, six varieties of aromatic leaves were offered and a floral bath has been rendered to the deities of Sri Sita Lakshmana sameta Sri Ramachandra Swamy in a colourful manner from 6pm onwards which lasted for more than two hours.

 

Deputy EO Sri Natesh Babu, Garden Deputy Director Sri Srinivasulu and other temple staff, religious staff and devotees were present.ana Tfust member Sri Sunil Reddy and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్‌  09: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
 
పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.
 
 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటలకు ముగియనుంది .ఇందులో తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, మొగలి  తదితర 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.  ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు  2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు.  
 
ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో అర్చక పరిచారకులు , అధికార అనధికారులు , భక్తుల వల్ల  తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు,  గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీశ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది