PUSHPAYAGAM IN KAPILESWARA SWAMY TEMPLE _ మే 5న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం
TIRUPATI, 22 APRIL 2023: The annual Pushpayagam will be observed in Sri Kapileswara Swamy temple on May 5 with Ankurarpanam on May 4.
After Navakalasa Snapana Tirumanjanam to Sri Kamakshi sameta Sri Kapileswara Swamy between 7:30am and 9:30am on May 5, Pushpayagam will be performed between 10am and 12am.
మే 5న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం
తిరుపతి, 2023 ఏప్రిల్ 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 5వ తేదీన పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 4వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
మే 5న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం చేపట్టనున్నారు.
లోక క్షేమం కొరకు, ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.