PUSHPAYAGAM IN TIRUMALA _ నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
TIRUMALA, 06 NOVEMBER 2023: The annual Pushpayagam will be observed in Tirumala temple on November 19 with Ankurarpanam on November 18.
It is usually observed after annual brahmotsavams in the advent of Sravana Nakshatra, the birth star of Sri Venkateswara in the holy month of Karthika.
On that day the processional deities will be offered floral tributes in the evening with tonnes of traditional, aromatic, ornamental flowers in a colourful manner after Snapana Tirumanjanam in the morning.
TTD has cancelled arjita sevas for that day owing to this celestial ritual.
నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల, 2023 నవంబర్ 06: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19వ తేదీ పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 18న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.