“PUSHPAYAGAM” OFFERS COLOURFUL VISUAL TREAT TO THE DEVOTEES_ సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం విజయవాడలో ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
SVV CONCLUDES ON A GRAND NOTE IN VIJAYAWADA
OVER TEN LAKHS TAKE PART IN SVV
VIJAYAWADA, JULY 9: Tens of thousands of devotees were captivated by the magical charm of the colourful Pushpaya Mahotsavam on the final day of Sri Venkateswara Vaibhavotsavams in PWD grounds at Vijayawada on the auspicious Guru Pournami day on Sunday.
RELIGIOUS IMPORTANCE: This religious fete in Tirumala is usually performed after annual Brahmotsavam in the asterism of Sravana Nakshatram, which also happens to be the birth star of Lord Venkateswara, usually in the month of Karteeka as per Hindu calendar which falls during October or November.
SIN-FREE FESTIVAL: There is also an age old belief that after performing a mega religious event, to overcome the commissions and omissions committed either knowingly or unknowingly by archakas, temple staff and devotees, this yagam is performed to wipe off the sins.
APPEASE MOTHER NATURE: As per the ancient scriptures, this festival is usually performed to save Mother Earth from natural calamities such as quakes, cyclones, epidemics and appease the Lord to save the ecology from all catastrophes.
FLORAL BATH WITH FIVE TONNES OF FLOWERS:
Over five tonnes of varieties of flowers were brought to the stadium in a celestial procession earlier during the day on Sunday morning.
Later the Utsava Murthies of Lord Sri Malayappa Swamy, flanked by His two Consorts,Sri Devi and Bhu Devi were seated on a finely decorated floral Mandapam. Later they were given a celestial floral bath with tonnes of 12 varieties of traditional flowers and ornamental flowers.
As soon as the flowers reached the height of the chest of the idols, they were removed and a floral bath was again given to the deities with another variety of flower and the same was repeated for 21 times amidst chanting of hymns till multi layered floral beds were formed.
The devotees were mused and delighted to see this unique religious fete with enthusiasm. Every inch of the spacious grounds was occupied by devotees who thronged to catch a glimpse of this awesome religious fete on Sunny Sunday. Tirupati JEO Sri P Bhaskar, Kalyanotsavam Project Special Officer Sri Prabhakar Rao supervised the arrangements.
Meanwhile it is estimated that almost ten lakh devotees have attended and watched various rituals during this six day fete.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం విజయవాడలో ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
తిలకించిన 10 లక్షల మంది భక్తులు
విజయవాడ, 2017 జూలై 09: తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడ నగరంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉదయం ప్రత్యేక సేవగా నిర్వహించిన పుష్పయాగానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
ప్రకృతి పులకించి చిరుజల్లుల రూపంలో ఆనందం వ్యక్తం చేసింది. సుగంధాల్ని వెదజల్లే రంగు రంగుల పుష్పాలు, పత్రాలతో ఈ పుష్పారాధన వేడుకగా జరిగింది. భక్తులతో కిక్కిరిసిపోయిన పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో పుష్పయాగ వేదిక భూలోక నందనవనాన్ని తలపించింది. పుష్పార్చన జరుగుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి దివ్యమనోహర రూపాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
ఇక్కడి పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో జూలై 4వ తేదీన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ నిర్వహించిన ప్రత్యేక సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఆరు రోజుల్లో మొత్తం 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.
వేడుకగా పుష్పయాగం :
ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఇందులో భాగంగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు.
అనంతరం ఉదయం 9.00 గంటలకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. వీటిలో విజయవాడలోని స్థానిక భక్తులు ఒక టన్ను పుష్పలను స్వామివారికి సమర్పించారు. తమిళనాడు నుంచి ఒక టన్ను, కర్ణాటక నుంచి ఒక టన్ను పుష్పాలను టిటిడి సమకుర్చింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మొదట పవిత్రమైన తులసీదళాల అర్చనతో పుష్పయాగం ప్రారంభమైంది. ఆ తరువాత మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పనీరాజనం సమర్పించారు. పూమెత్తపై స్వామి, అమ్మవార్లను దర్శించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు. టిటిడి ఆగమ పండితుల నేతృత్వంలో సుమారు రెండున్నర గంటల పాటు నేత్రపర్వంగా పుష్పయాగం సాగింది.
ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ డి.సి.పి. శ్రీ టి.కె.రాణా, టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు, ఒ.ఎస్.డి. శ్రీ సుబ్బరాయుడు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.