PUSHPAYAGAM VISUAL TREAT AT TIRUCHANOOR _ శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
TIRUPATI, 19 NOVEMBER 2023: The colourful floral ceremony was a visual treat to the devotees who took part in the celestial annual Pushpayagam held in Tiruchanoor on Sunday evening.
About three tonnes of various ornamental and traditional flowers have been used during the ceremony.
TTD EO Sri AV Dharma Reddy JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and other temple officials were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుపతి, 2023 నవంబర్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా జరిగింది.
వేడుకగా స్నపన తిరుమంజనం :
ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3 టన్నుల పుష్పాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు పుష్పాలు, పత్రాలను అందించారు.
పుష్పాల ఊరేగింపు :
మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.
అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.
బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మా రెడ్డి దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీమతి శ్రీవాణి, శ్రీ మధుసూదన్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ గణేష్, శ్రీ సుభాష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.