RADHA SAPTHAMI OBSERVED IN GT _ సప్త వాహ‌నాల‌పై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

 
TIRUPATI, 04 FEBRUARY 2025: The Utsava Murthy of Sri Govinda Raja Swamy took out a celestial ride on seven different vahanams from dawn to dusk on the auspicious occasion of Radha Sapthami in connection with Surya Jayanti on Tuesday.
Starting with Suryaprabha Vahanam, Sri Govindaraja Swamy graced devotees on Hamsa, Hanumanta, Pedda Sesha, Mutyapu Pandiri, Sarvabhoopala and in the night between 7 pm and 8.30pm on Garuda Vahanam to conclude the Saptha Vahana Sevas.
Deputy EO Smt Shanti, AEO Sri Munikrishna Reddy and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సప్త వాహ‌నాల‌పై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

తిరుప‌తి, 2025 ఫిబ్ర‌వ‌రి 04 ; తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు స‌ప్త వాహనాలపై విహ‌రించి భక్తులను కటాక్షించారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు.

అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.

సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవి, శ్రీ శేష‌గిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.