RADHASAPTHAMI OBSERVED IN NARAYANAVANAM _ నారాయణవనం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

NARAYANAVANAM, 04 FEBRUARY 2025: On the auspicious occasion of Radhasapthami, Sri Kalyana Venkateswara took out celestial rides on various vahanams to bless His devotees on Tuesday.
 
As a part of it began with Suryaprabha, the Utsava deity graced on Chinna Sesha, Pallaki, Kalpavriksha and Pedda Sesha vahanams from 6.30 am till 1 pm.
 
AEO Sri Ravi other temple staff, and devotees were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయణవనం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

నారాయణవనం, 2025 ఫిబ్ర‌వ‌రి 04 ; నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన్ని మంగ‌ళ‌వారం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఉదయం సూర్యుని కిర‌ణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామి, అమ్మ‌వార్ల‌పై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యప్రభ, చిన్నశేష, పల్లకీ, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించారు.

సాయంత్రం 6.30 గంటలకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ర‌వి, సూప‌రింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నారాయణ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.