RADHOTSAVAM HELD ON PENULTIMATE DAY AT APPALAYAGUNTA _ రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం
TIRUPATI, 14 JUNE 2025: The procession of wooden chariot took place at Appalayagunta on Saturday.
The ongoing annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple entered the eighth day.
On the penultimate day, Sri Prasanna Venkateswara Swamy took out a celestial ride blessing His devotees along four mada streets encircling the temple.
Meanwhile on Sunday Chakra Snanam will be observed at 10:30am.
DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, superintendent Smt Srivani and others were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం
తిరుపతి/ అప్పలాయగుంట, 2025, జూన్ 14: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఉదయం 7 – 8.30 గం.ల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహపూజ చేపట్టారు. తదుపరి 8.41 – 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 – 10.30 గం.లకు భక్తజనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు.
సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 – 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 – 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 – 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 – 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.