RAISING PROVOKING SLOGANS IN THE DARSHAN QUEUE LINE IS WRONG _ దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం తప్పే

DEVOTEE APOLOGIZES TO TTD AND SRIVARI DEVOTEES FOR HIS MISTAKE

Tirumala, 13 March 2026: On Thursday night, while in the queue line for Srivari Darshan, a devotee named Sri Anupoju Veera Naveen from Rajamahendravaram incited fellow devotees to raise slogans while waiting in the Narayanagiri sheds.

When the incident was brought to the attention of TTD, the said devotee was summoned. The devotee admitted that raising slogans and provoking others within the Darshan queue line was his mistake.

Consequently, the devotee tendered his apologies to TTD and to  the fellow devotees.

Meanwhile, TTD appeals to all its devotees to maintain restraint and patience while waiting for their turn for Srivari Darshan, and to cooperate with the staff.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం తప్పే

టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు

తిరుమల, 2026 మార్చి 13: శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు.

ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు.

ఇందుకుగాను టీటీడీ మరియు శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు.

కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.