RAJAMANNAR BLESSES ON DIVINE TREE CARRIER _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి
TIRUPATI, 01 DECEMBER 2024: Sri Padmavati Devi decked as Rajamannar blessed Her devotees on the divine Kalpavriksha Vahanam on Sunday.
The fourth day of the ongoing annual Karthika Brahmotsavam at Tiruchanoor witnessed Sri Padmavati Devi donning the Alankaram of Protector of the Living beings.
Both the Pontiffs of Tirumala, EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి
తిరుపతి, 2024 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య వాహనసేవ కోలాహలంగా జరిగింది.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ జె.శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.