RAJAMANNAR CHEERS ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
TIRUMALA, 30 SEPTEMBER 2022: Wearing Rajamudi (head gear), holding a Dandam(hand weapon), Sri Malayappa flanked by Sridevi and Bhudevi on either side, cheered His devotees on the majestic “Rajamannar” Alankaram on the fourth day morning on Friday on Kalpavriksha Vahanam.
Draped in colourful silk robes, decked in precious stone studded jewels, Kuruver Garlands, Sri Malayappa took a celestial ride on the Divine Boon Giving Tree.
The devotees were thrilled to see the Universal Lord as Rajamannar atop the sacred tree in all His celestial splendour braving the showers chanting “Govinda… Govinda”.
Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, board member Sri Ashok Kumar and other senior officers were present.
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2022 సెప్టెంబరు 30: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్‌కుమార్, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.