RAJAMANNAR GRACES ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
TIRUPATI, 13 JUNE 2022: In the guise of Rajamannar, Sri Prasanna Venkateswara blessed His devotees on Kalpavriksha Vahanam
On the fourth day morning on Monday as a part of the ongoing annual Brahmotsavams, the divine tree carrier seva took place.
Temple DyEO Sri Lokanatham, Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2022 జూన్ 13: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 5 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు సర్వభూపాలవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.