RAJAMANNAR GRACES ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి :
TIRUPATI, 11 FEBRUARY 2026: Sri Kalyana Venkateswara as Rajamannar graced on the divine wish fulfilling tree carrier on the morning of Wednesday.
The fourth day during the nine day annual brahmotsavams witnessed Sri Kalyana Venkateswara flanked by Sridevi and Bhudevi in the Rajamannar Alankaram.
Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and other temple, religious staff, devotees, dance troupes, sevaks participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి :
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణభట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.













