RAJAMANNAR ON KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనసేవలో కళావైభవం
Tirumala,21 September 2023: On the fourth day of the ongoing Srivari annual Brahmotsavam Sri Malayappa Swamy posed majestically as Rajamannar blessed His devotees on Kalpavruksha Vahanam on Thursday morning.
According to the legend Kalpavruksham, the wish-granting divine tree, was brought from heaven by Viswakarama and made Brahmotsavam vahanam for Sri Malayappa Swamy.
The four mada streets reverberated with chants of Govinda Namams as the procession paraded forwarded.
As usual, Lord Brahma in His invisible form led the procession sitting in the wooden chariot. Well-decorated horses and elephants followed the Brahmaratham.
The Tirumala pontiffs, TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనసేవలో కళావైభవం
తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.
హైదరాబాదుకు చెందిన సంతోశ్ బృందం పేర్ని నృత్యం, తిరుపతికి చెందన సుకన్య బృందం కృష్ణ తులాభారం, తెలంగాణకు చెందిన సి.హెచ్.ప్రశాంత్ బృందం ఒగ్గుడోలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, చెన్నైకి చెందిన భారత్ కళా అకాడమీ గజ్జెనృత్యం, తెలంగాణ రాష్ట్రం జనగాం కు చెందిన పి.శ్రీనివాస్ బృందం డప్పు వాయిద్యం, ఇ. మహేశ్వరి బృందం ఘట విన్యాసం, బి.కవిత బృందం బోనాల నృత్య రూపకం, లంబాడి నృత్యం, విశాఖపట్నంకు చెందిన ఎన్.రాగబుజ్జి బృందం కోలాటం, కె.సునీత బృందం లెజిమ్ వాయిద్యం భక్తులను అలరించాయి. మొత్తం 10 కళాబృందాల్లో 226 మంది కళాకారులు పాల్గొన్నారు.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.