RAJAMANNAR RIDES ON KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప
Tirumala, 3 Oct. 19: On the fourth day of the ongoing Navaratri Brahmotsavams of Lord Venkateswara thousands of devotees were enthralled by the procession of ‘Kalpavriksha Vahanam’ in the morning hours of Thursday.
The processional deities of Sri Malayappa Swamy flanked by His two divine consorts mounted atop the golden Kalpavruksha Vahanam were taken out in a grand procession around the Mada streets encircling the holy shrine.
The Kalpavruksha Vahanam is adorned with three divine elements of Kalpavruksha, Kamadhenu and Chintamani which are popular in Hindu mythology for granting all boons to their devotees indicating that Lord Venkateswara was the embodiment of all of them. The deity was also bedecked with very rare and precious jewels befitting the occasion.
The Kalpavruksha Vahanam of Lord Venkateswara is also a magnificent sight of greenery as it denotes the significance and importance of environment protection and forests even in the mythological lores and celestial governance of all the worlds. To depict the same, Sri Malayappa Swamy draped in green dress blessed His devotees in Rajamannar Alankaram.
Acting CJ of AP High Court Justice Praveen Kumar, TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప
అక్టోబరు 03, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
కాగా, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన శుక్రవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ పృథ్విరాజ్, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.