RAMAKRISHNA THEERTHA MUKKOTI HELD _ ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Tirumala, 17 Jan. 22: The annual Ramakrishna Theertha Mukkoti was held in Ekantam following Covid restrictions in Tirumala on Monday.

 

Among various torrent festivals observed every year in Tirumala, Ramakrishna Theertha Mukkoti is one of the most important ones which occurs on the full moon day of the month Pushya.

 

A team of Archakas and temple staff went to Ramakrishna Theertham and performed Abhishekam to the deities of Sri Rama and Sri Krishna located here. Afterwards, Harati and Naivedyam were offered and returned to the temple.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 17: తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా చేప‌ట్టారు.

శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.