RAMANUJACHARYA’S SERVICES TO TIRUMALA KAINKARYAM ARE EXCEPTIONAL – SCHOLAR SRI NARASIMHAN _ తిరుమల కైంకర్య వ్యవస్థకు రామానుజాచార్యుల సేవలు విశిష్టం – ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ నరసింహన్
Tirupati, April 21, 2026: Scholar Sri Narasimhan said that the kainkaryam (service) system established by Sri Ramanujacharya in Tirumala is continuing even today.
He delivered a discourse on “Ramanujacharya – Tirumala Kainkaryam” on the second day of the Avatar Mahotsavams held at Annamacharya Kalamandiram.
He explained that the systems introduced by Ramanujacharya in Tirumala, Sri Govindaraja Swamy Temple, and other Divya Desams are still in practice. He also noted that services like Brahmotsavams, Abhishekams, and the Jeeyar system were initiated by him.
Later, a Harikatha program was presented by Sri Chandrasekhar Bhagavatar of Tirupati.
Alwar Divya Prabandha Project Coordinator Sri Purushottam, officials, and a large number of devotees participated in the program.
Issued by Chief Public Relations Officer, TTD
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల కైంకర్య వ్యవస్థకు రామానుజాచార్యుల సేవలు విశిష్టం – ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ నరసింహన్
తిరుపతి, 2026 ఏప్రిల్ 21: తిరుమలలో శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన కైంకర్య విధానాలు నేటికీ కొనసాగుతున్నాయని శ్రీ నరసింహన్ తెలిపారు.
అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అవతార మహోత్సవాల రెండవ రోజు ఆయన “రామానుజాచార్యులు – తిరుమల కైంకర్యము”పై ప్రసంగించారు.
తిరుమల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం మరియు ఇతర దివ్యదేశాల్లో ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పటికీ అమలులో ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు, జీయర్ వ్యవస్థ వంటి సేవలను ప్రారంభించారని వివరించారు.
అనంతరం తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ భగవాతార్ హరికథ గాన కార్యక్రమంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



