RECENT MEASURES ENHANCED TASTE OF ANNAPRASADAM-TTD EO _ అన్నప్రసాద విభాగంలో ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత పెరిగింది- అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

* EO SPOT INSPECTION OF MTVAC
 

Tirumala,10,July 2024: Recent measures taken in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) to provide more delicious Annaprasadam to tens of thousands of devotees who come every day to Tirumala, has enhanced the taste of delicacies, said TTD EO Sri J Syamala Rao.

Along with TTD JEO Sri Veerabrahaman, the EO conducted a surprise inspection at MTVAC on Wednesday. Later speaking to media he said all out efforts have been made to provide tastier and qualitative Anna Prasadam to devotees. He said daily nearly two lakh pilgrims consume Annaprasadams in Tirumala. Keeping this in view, special officers were deployed to keep the complex clean and hygiene.

To increase the quality and quantity furthermore as per the increasing demand, modernisation of the 10-15 year old cooking equipment is being contemplated. Complimenting the services of work force of Annaprasadam, the EO said steps will be initiated soon as per the recommendations submitted by a team of culinary, catering experts from South India Association of Chefs besides increasing the manpower.

Deputy EO Sri Rajendra Kumar, Catering Special Officer Sri GLN Shastri and other officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

అన్నప్రసాద విభాగంలో ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత పెరిగింది

– అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

తిరుమల, 10 జూలై 2024: దేశ విదేశాల నుండి ప్రతి రోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో, జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర, సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యము, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10 – 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నపసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు.

ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్ లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు.

ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.