RECORD-HIGH LADDU SALES LAST YEAR _ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ల‌డ్డూల విక్ర‌యం

10% INCREASE COMPARED TO 2024

DEVOTEES EXPRESS SATISFACTION WITH ENHANCED TASTE AND QUALITY

HIGHEST SINGLE-DAY SALE OF 5.13 LAKH LADDUS ON DECEMBER 27

Tirumala, 01 January 2026: In 2025, the sale of Srivari Laddu prasadam reached a record high creating an All Time Highest Sale in a decade.

Compared to 2024, laddu sales increased by 10 percent. While 12.15 crore laddus were sold to devotees in 2024, around 13.52 crore laddus were sold in 2025(an additional 1.37 crore laddus compared to the previous year).

Marking an unprecedented milestone in the past decade, devotees purchased a maximum of 5.13 lakh laddus on a single day, December 27 in 2025. 

TTD prepares around 4 lakh laddus every day and makes them available to devotees. On important days, production goes up to as many as 8 -10lakh laddus(including buffer stock).

Around 700 Sri Vaishnava Brahmins work in two shifts, round the clock, at the Srivari Potu, preparing the laddu prasadam with strict adherence to religious discipline and tradition.

In recent times, devotees have expressed happiness and satisfaction over the improved quality and taste of the laddus prepared by TTD.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఏడాది రికార్డు స్థాయిలో ల‌డ్డూల విక్ర‌యం

గ‌త ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం

ల‌డ్డూల రుచి, నాణ్య‌త‌పై భ‌క్తుల్లో సంతృప్తి

డిసెంబ‌ర్ 27 అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

తిరుమ‌ల‌, 2026 జనవరి 01: 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది 12.15 కోట్ల‌ ల‌డ్డూల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది 13.52 కోట్ల ల‌డ్డూల‌ను టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది.

గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఎన్న‌డూ లేనివిధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదిన అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం. 

టీటీడీ గత సంవత్సరం గా ప్ర‌తిరోజూ 4 ల‌క్ష‌ల వరకూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తోంది. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుండి 10 లక్షల ల‌డ్డూల వ‌ర‌కు(buffer)భక్తలకు అందుబాటులో ఉంచుతోంది.

700 మంది శ్రీ‌వైష్ణ‌వ బ్ర‌హ్మ‌ణులు శ్రీ‌వారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంట‌లు శ్ర‌మిస్తూ నియ‌మ‌, నిష్ట‌ల‌తో స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను త‌యారు చేస్తారు. 

ఇటీవ‌ల కాలంలో ల‌డ్డూల నాణ్య‌త‌, రుచి పెర‌గ‌డంపై భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.