RECORD NUMBER OF DEVOTEES HAD DARSHAN IN TIRUMALA ON THURSDAY _ తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

Tirumala, 23 May 2025: Owing to the peak summer rush, the number of devotees visiting Tirumala has increased incredibly over the past week.

Due to the Thiruppavada Seva in the morning and the Poolangi Seva in the evening on Thursdays, the darshan of devotees is usually reduced by more than two to three hours than normal.

As such, only a maximum of 62 to 63 thousand devotees would have darshan of Srivaru usually on Thursdays.

However, under the direct supervision of the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, all the departments in Tirumala made coordinated efforts from time to time which ended up in providing Srivari Darshan to more than ten thousand devotees on May 22, which is a rare record.

On Thursday, a total of 72,579 devotees had darshan of Sri Venkateswara Swamy and the Additional EO congratulated the staff of all the departments for their sincere coordinated efforts and dedication.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైంది – అదనపు ఈఓ

తిరుమల, 2025 మే 23: వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది.

సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.

గురువారం నాడు సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు
మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.

అయితే అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో, తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది.

ఈ కారణంగా తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు అదనపు ఈవో విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది