RECORD NUMBER OF PILGRIMS HAD DARSHAN ON MAY 31 _ మే 31న అత్యధిక భక్తులకు దర్శనం
ANNPRASADAM SERVINGS CROSSES ONE CRORE MARK THIS MAY
TIRUMALA, 01 JUNE 2025: In a record of its sorts in the last one decade, TTD has provided a comfortable and hassle-free Darshan to 95,080 devotees on Sunday.
The Hill temple of Tirumala has been witnessing the swarm of pilgrims especially since Mid of May. With the day and night efforts of various departments of TTD, record number of devotees were provided Darshan even on Thursdays and Fridays in the second half of May.
Under the instructions of TTD higher authorities and in the continuous monitoring of the Heads of various departments of TTD, distribution of Annaprasdam, water, milk have been carried out with the help of Srivari temple and security wing of TTD, maximum number of devotees have been provided comfortable darshan.
When compared to May last, over 55thousand devotees had darshan in addition this year taking the total figure to 23,79252 as against 23,23,493 during last. And the total darshan figures to the pilgrims have crossed 95thousand mark on Sunday, the May 31.
Similarly, the Annaprasadam servings have set a new record with highest servings ever, taking the figure to 1.33crore in May 2025 as against 71lakhs in 2024.
While the numbers of tonsures stood and number of laddus being sold this May also topped against the figures of May last.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 31న అత్యధిక భక్తులకు దర్శనం
మే మాసంలో కోటి మార్క్‌ను దాటిన అన్న ప్రసాదాల వితరణ
తిరుమల, 2025 మే 01: దాదాపు దశాబ్ద కాలం అనంతరం, తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో మే 31న 95,080 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం.
మే 16 నుండి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా అహర్నిశలు విధులు నిర్వహించి, గత రెండు వారాల్లోని గురువారాలు, శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది.
టీటీడీ ఉన్నతాధికారుల నిర్దేశాల మేరకు, వివిధ విభాగాల అధిపతుల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ సిబ్బంది, విజిలెన్స్ విభాగం సహకారంతో అన్నప్రసాదం, తాగునీరు, పాల వితరణ భక్తులకు సమర్థవంతంగా అందించడం జరిగింది. దీంతో అనేకమంది భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలిగారు.
గతేడాది మే నెలతో పోల్చితే, ఈసారి 55,759 మంది అధికంగా దర్శనం పొందారు. 2024 మేలో 23,23,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2025 మేలో 23,79,252 మంది భక్తులు దర్శించుకున్నారు.
అలాగే, అన్నప్రసాద వితరణలో కూడా ఈ ఏడాది నూతన రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల వితరణలు జరిగితే, ఈ సంవత్సరం 2025 మేలో 1.33 కోట్ల వితరణలు నమోదు కావడం విశేషం.
ఇంతేకాకుండా, ఈ మే నెలలో తలనీలాల సంఖ్య, లడ్డూ విక్రయాల పరంగా కూడా గత ఏడాది మేతో పోల్చితే అధికంగా నమోదు కావడం గమనార్హం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.