REJUVENATION OF ALIPIRI FOOTPATH ROUTE FOR THE BENEFIT OF DEVOTEES-TTD CHAIRMAN _ నడకదారి షెల్టర్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన

RELIANCE INDUSTRIES CAME FORWARD TO BEAR THE PROJECT COST OF Rs.25cr

 DyCM TAKES PART IN BHOOMI PUJA 

The Bhoomi Puja for the rejuvenation works of the Alipiri footpath route from Alipiri to GNC was performed at Alipiri on Monday by TTD Trust Board Chairman Sri Y V Subba Reddy along with Deputy CM Sri Narayanaswamy and TUDA Chairman and TTD Ex-officio member Dr C Bhaskar Reddy.

Speaking on this occasion, the Chairman said, the footpath route which was constructed over two and a half decades ago was in a bad shape. So TTD has decided to rejuvenate the shelter all along the 7.6km trek route from Alipiri to the GNC toll gate at Tirumala for the benefit of the safety and security of devotees.

Usually, during normal days around 20,000 devotees walk to Tirumala via this footpath while during summer vacation and auspicious days the number shoots up to over 40,000.

The TTD engineering officials have made an estimation of ₹25 crore for a complete overhaul of the footpaths with – roof slab, drinking water pipelines, toilets, health centers, security outposts, electricity and broadcasting (Public Address System) cables. Reliance Industries Limited has come forward to take up the works on a donation basis for TTD.

Adding further he said, there has been a delay in the commencement of the footpath rejuvenation works due to the Covid pandemic. However, he said, the Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy has instructed to complete the work as soon as possible in view of the benefit of the pilgrims”, he maintained.

The Chairman said, when late Sri YS Rajasekhara Reddy was the Chief Minister of Andhra Pradesh, the Srivari Mettu footpath renovation project completed. And now during his son’s regime as AP CM, the renovation of Alipiri footpath project taken up as per the wish of Lord Venkateswara”, he observed.

Reliance Industries Limited State Head for Constructions Sri AVVS Rao said, it is a privilege to be a part in this prestigious project and expressed his confidence that they will definitely complete the rejuvenation works of the Alipiri footpath route on time for the benefit of the pilgrims.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CE Sri Ramesh Reddy, EE Sri Chandrasekhar, AVSO Sri Surendra and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నడకదారి షెల్టర్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన.
– పనులు 6 నెలల్లో పూర్తి చేయాలని చైర్మన్ సూచన.

తిరుపతి. 28 సెప్టెంబరు 2020: అలిపిరి నుంచి తిరుమల గరుదాద్రి నగర్ వరకు నడక దారి లో నూతనంగా నిర్మించనున్న షెల్టర్ట్ ( పై కప్పు) నిర్మాణానికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..

అలిపిరినుంచి తిరుమల జి ఎన్ సి వరకు నిర్మించిన నడకదారి షెల్టర్ బాగా పాడైంది.

– భక్తుల భద్రత దృష్ట్యా దీన్ని పునర్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
– ఈ మార్గం లో రోజుకు 30 నుంచి 35 వేల మందికి దాకా భక్తులు నడచి వస్తున్నారు.
– పర్వదినాల్లో, ముఖ్యమైన రోజుల్లో రోజుకు 40 వేలకు పైగా నడచి వస్తున్నారు.

– 7. 60 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ నడక దారి పై కప్పు తో పాటు తాగునీటి పైప్ లైన్లు, మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, సెక్యూరిటీ పోస్ట్ లు, విద్యుత్, బ్రాడ్కాస్టింగ్ కేబుల్స్ కొత్తవి ఏర్పాటు చేయడానికి రూ 25 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు.

– రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ విరాళం కింద ఈ పనులు చేయడానికి ముందుకు వచ్చింది.
-. శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని 6 నెలలో పనులు పూర్తి చేసి కొత్త షెల్టర్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దాతను, అధికారులను కోరుతున్నాను.

— కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటి సీఎం శ్రీ నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు.

– చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం శ్రీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీవారి మెట్టు నడక దారిలో షెల్టర్ నిర్మించారని, ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అలిపిరి నుంచి తిరుమలకు నడక దారి పునర్నిర్మించడం ఆ కుటుంబం అదృష్టమని చెప్పారు.
– రిలయన్స్ నిర్మాణ విభాగం రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ ఎ వి ఎస్ ఎస్ రావు మాట్లాడుతూ శ్రీ వారు ఇది తమకు కల్పించిన అదృష్టమని చెప్పారు. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు..

టీటీడీ అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీ రమేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం శ్రీ నారాయణ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జె ఈ ఓ శ్రీ బసంత్ కుమార్ అలిపిరి పాదాలమండపం లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది