RELEASE OF SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM WALL POSTERS BY EO  _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ పోస్టర్ల  ఆవిష్కరణTTD

Tirupati, 20 Feb 2013:  Tirumala Tirupati Devasthanams Executive Officer Sri L.V.Subramanyam has released TTDs Sri Kalyana Venkateswara Swamy Temple Brahmotsavam wall poster that is scheduled from March 1 to March and Sri Kapileswara Swamy Temple Brahmotsavam wall poster scheduled from March 3 to 12 at his chambers in Tirupati on Wednesday.

The Important days of Sri Kalyana Venkateswara Swamy Temple Brahmotsavam- March 1 -Dwajarohanam, March 5 -Garuda Vahanam, March 8 -Rathotsavam, March 9- Chakrasnanam.

The Important Days of Sri Kapileswara Swamy Temple Brahotsavam: March 3 –Dwajarohanam, March 10- Mahasivarathri- Nandi Vahanam, March 11- Kalyanotsavam, March 12- Trisula Snanam.

Local Temples DyEO Smt Reddamma, Spl Officer DPP Sri Raghunath, AEO Sri Lakshman Naik, Superintendents Sri Suresh Reddy, Sri N.Krishna Rao, Editor in Chief Sri Rava Sri Hari and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ పోస్టర్ల  ఆవిష్కరణ

తిరుపతి, ఫిబ్రవరి 20, 2013  : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవ పోస్టర్లను తిరుపతి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తితిదే పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.
 
ఈ సందర్బంగా ఇ.ఓ మాట్లాడుతూ మార్చి 1వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 9వ తేదిన చక్రస్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు శ్రీనివాసమంగాపురం, తిరుపతి పరిసర ప్రాంతాలలోని 200 గ్రామాలలో ప్రచార రథం, భజన బృందాలు వెళ్ళి పోస్టర్లు, పాంపెట్ల ద్వారా ఊరూరా, ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
తేదీ ఉదయం సాయంత్రం
01-03-13(శుక్రవారం) ధ్వజారోహణం(మకరలగ్నం) పెద్దశేష వాహనం
02-03-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
03-03-13(ఆదివారం) సింహ వాహనం   ముత్యపుపందిరి వాహనం
04-03-13(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
05-03-13(మంగళవారం) పల్లకి ఉత్సవం (మోహినీ అవతారం)   గరుడ వాహనం
06-03-13(బుధవారం) హనుమంత వాహనం గజ వాహనం
07-03-13(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-03-13(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
09-03-13(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ పోస్టర్లను తిరుపతి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తితిదే పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమై 10 రోజుల పాటువార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు.
 
తేదీ ఉదయం సాయంత్రం
 
03-03-13(ఆదివారం) ధ్వజారోహణం హంస వాహనం
04-03-13(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
05-03-13(మంగళవారం) భూత వాహనం సింహ వాహనం
06-03-13(బుధవారం) మకర వాహనం శేష వాహనం
07-03-13(గురువారం) అధికారసంధి వాహనం తిరుచ్చి ఉత్సవం
08-03-13(శుక్రవారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
09-03-13(శనివారం) కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం
10-03-13 (ఆదివారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
11-03-13(సోమవారం) పురుషామృగవాహనం అశ్వవాహనం
12-03-13(మంగళవారం) త్రిశూలస్నానం ధ్వజఅవరోహణం
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి సి. రెడ్డెమ్మ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ప్రత్యేక అధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.