Release of Telugu Panchagam at S.V.Vedic University campus _ టిటిడి పంచాగం ఆవిష్కరించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirupati, 05 March 2010:Sri Y.Bhaskar Rao, Retired Chief Justice Of Karnataka High Court, Sri D.K.Audikesavulu, Chairman TTD has today released “VIKRUTHANAMA SAMVASTARA PANCHAGAM” in the S.V.Vedic University campus, Tirupati on Friday.
 
Sri I.Y.R.Krishna Rao, Executive Officer, Board Members Dr M.Anjaiah, Sri Kale Yadaiah, TTD, Dr N.Yuvaraj, Joint Executive Officer, Dr Kavitha Prasad, Secretary HDPP and others were present.
 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి పంచాగం ఆవిష్కరించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుపతి, 2010 మార్చి 05: శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అంతర్జాతీయ వేద సదస్సునందు ముగింపు సమావేశంలో తితిదే పాలకమండలి చైర్మన్‌ శ్రీ డి.కె. ఆదికేశవులు, రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తి  శ్రీ భాస్కరరావులు తితిదే తెలుగు, తమిళ పంచాంగములను విడుదల చేశారు.
 
ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శ్రీ కె. యాదయ్య, డాక్టర్‌ ఎం. అంజయ్య,         ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, జె.ఇ.ఓ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌. కవితాప్రసాద్‌, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుదర్శనశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అర్యభట్టు, వరాహమిహిరుడులాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందింది.

సర్వమానవుల దైనందిన కార్యక్రమాల మీద తమ ప్రభావాన్ని చూపే ఈ గ్రహాల భ్రమణాన్ని తెలియచేసే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే పంచ అంగాలతో కూడుకుని ఉంటుంది. అందుకే దీనికి ”పంచాంగం” అని పేరు వచ్చింది.

సంవత్సరం పొడవునా సంభవించే వాతావరణ పరిణామాలు, పంటలు, ధరలు, మానవ సంబంధాలు, పాలకుల ఉత్థాన పతనాలులాంటి అనేక విషయాలను ఈ పంచాగం విశదీకరిస్తుంది. మానవులు చేసుకునే సత్కర్మ దుష్కర్మల ఫలితాలను క్రమం తప్పకుండా ఆయా వ్యక్తులకు సంక్రమింప చేయడానికే సృష్టిలోని ఈ గ్రహచక్రం పరిభ్రమిస్తోంది. ఇది విశ్వరహస్యం. దీనిని పరిశోధించిన వాళ్ళు భారతీయులే!

ఈ వికృతనామ తెలుగు ఉగాది సంవత్సరంలో చోటు చేసుకుంటున్న ప్రకృతి పరిణామాలను, మానవ ప్రకృతి స్వరూప స్వభావాలను, శుభ మూహూర్తాలను, రాసుల ఫలితాలను ఇత్యాది విషయాలను తిరుమల తిరుపతి దేవస్థాన సిద్ధాంన్తి శ్రీ తరగిరాల ప్రభాకర పూర్ణయ్యగారు రచించగా, దేవస్థాన ఆస్థాన పండితులు అప్పికట్ల శ్రీమాన్‌ పణ్డిత వేదాన్త దేశికాచార్యుల వారిచే పరిష్కరింపబడినది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.