RENOVATIONS AT SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE_ జూలై 30 నుంచి ఆగ‌స్టు 1వ తేదీ వరకు త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ

Tirupati, 27 July 2025: As part of the renovation of the Dwajasthambham at the Sri Lakshmi Narasimha Swamy Temple in Tarigonda, Annamaiah District, a three-day Balalayam ritual will be observed from July 30 to August 1, 2025.

The proceedings will begin with Ankurarpanam at 6 PM on July 29.

July 30:

Morning – Chatushtanarachana, 

Evening – Nitya Havanams, Dwara Puja, and Ekanta Seva.

July 31:

Morning – Abhishekam to the Dwajasthambham

Evening – Nitya Havanams and Ekanta Seva.

August 01:

Maha Poornahuti, dismantling of the Dwajasthambham, Udvasana rituals  followed by Maha Nivedana – all performed as per Agama traditions.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 30 నుంచి ఆగ‌స్టు 1 తేదీ వరకు త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ 

తిరుపతి, 2025 జూలై 27: అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కొరకు  జూలై 30 నుంచి ఆగ‌స్టు 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు బాలాలయంనిర్వహించనున్నారు.  ఇందుకోసం జూలై 29న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నున్నారు.

జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.

ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.