RESTRICTIONS ON FOOTPATH RESTRICTIONS RELAXED ONLY AFTER FOREST DEPARTMENT CLEARANCE- TTD CHAIRMAN _ అటవీ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే 2 గంటల తరువాత చిన్న పిల్లలకు నడక దారిలో అనుమతి

Tirumala, 02 October 2023: Asserting that the safety and security of pilgrim devotees is most important, the Chairman of TTD Sri. Bhumana Karunakara Reddy clarified that only if the forest department officials confirm that there is no threat from wild animals along the Alipiri Footpath route, the time restrictions will be relaxed in the case of children under the age of 12 years.  

On Monday, the Chairman inspected the queue lines from Gogarbham Circle to Krishna Teja Circle in the background of the continued heavy pilgrim rush in Tirumala since Thursday evening.  He inquired whether the devotees are getting food, drinking water, coffee, tea, buttermilk.  He directed the authorities to make more arrangements so that the devotees do not face any trouble.  

Later, speaking to the media, he said that the number of devotees in Tirumala have increased in the last four days due to the sacred Purattasi month and holidays. He said that the queue lines extended upto 4 to 5 kms. With the intention of giving quick darshan to the common devotees, TTD has cancelled VIP break, supatham and slotted sarva darshanam tokens.  The devotees in the queue lines said that they have provided adequate facilities without getting impatient anywhere.  He said that a large number of devotees is being anticipated for the upcoming Navratri Brahmotsavam from October 15 to 23 and TTD authorities are making necessary arrangements for the big event.

CHAIRMAN LAUDS TTD OFFICIALS

The Chairman lauded the impeccable services of TTD officials and employees under the directives of TTD EO Sri AV Dharma Reddy in the supervision of JEO and CVSO, in the last four days in maintaining the unprecedented pilgrim crowd situation working day and night without giving scope for any untoward incident. 

JEO Sri Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Health Officer Dr Sridevi, Annaprasadam DyEO Sri Rajendra, Deputy CF Sri Srinivasulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అటవీ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే 2 గంటల తరువాత చిన్న పిల్లలకు నడక దారిలో అనుమతి – తిరుమలలో క్యూ లైన్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల 2 అక్టోబరు 2023: అలిపిరి నుండి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు.

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు , కాఫీ , టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు.

అనంతరం చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూ లైన్లు 4 నుండి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరిత గతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పం తో వి ఐ పి బ్రేక్ , సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చైర్మన్ చెప్పారు. క్యూ లైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని చెప్పారు . అక్టోబరు 15నుండి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు.

అధికారుల పనితీరు బ్రహ్మాండం

విపరీత మైన భక్తుల రద్దీ ఉండటంతో ఈవో, జేఈవో, సివిఎస్వో, ఆరోగ్యం ఇతర అధికారులందరూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీరు ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలక్కుండా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు.

జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్వో శ్రీ శ్రీనివాసులు, విజివో లు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, డి ఎస్పీ శ్రీ భాస్కర్ రెడ్డి , డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, సిఐ లు శ్రీ జగన్మోహన్ రెడ్డి , శ్రీ చంద్రశేఖర్ తదితరులు చైర్మన్ వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది