REVIEW MEET ON ARRANGEMENTS AT GANDI _ గండి శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి – టిటిడి ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirupati, 29 July 2008: All the Engineering works at Gandi have to be completed within a couple of days told Sri A.V.Dharma Reddy Spl. Officer, TTD. He has reviewed the works for the conduct of Sravana masa Utsavams in Sri Veeranjaneya Swamy Temple, the sub-temple of TTD located in Gandi of Kadapa district, On Tuesday morning at his chamber.
While reviewing, he asked the Exe. Engineer to erect additional Toilets as well as necessary pendals and Queue lines for visiting devotees. He asked the Dy.EO Annadanam to distribute prasadam to the devotees. Later he directed the DPP Secretary and the Director, Annamacharya Project to arrange music concerts, Harikatha programmes during the Utsavams from August 2 to 30. Further, Sri Dharma Reddy Said that the necessary Cooperation will also be sought from the local administration to make the function a success.
Dr Medasani Mohan, Director Annamacharya Project, Dr Vijaya Rahavacharyulu, Secretary DPP, Sri Ramachandra Reddy Estate Officer, Sri Muralidhar, S.E ., Electrical, Sri Chengalrayulu, Spl. Grade Dy.EO., Sri PAT and others have participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గండి శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి – టిటిడి ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, జూలై-29, 2008: కడప జిల్లాలోని గండిక్షేత్రంలో గల శ్రీవీరాంజనేయస్వామి వారి ఆలయంలో ఆగస్టు 2వ తేది నుండి నెల రోజుల పాటు నిర్వహించనున్న శ్రావణమాస మహోత్సవములు వైభవంగా నిర్వహించాలని తితిదే ప్రత్యేకాధికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం ఆయన తిరుపతి పరిపాలనాభవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండిక్షేత్రంలో ఆగస్టు 1వ తేదినుండి 30వ తేది వరకు నిర్వహించనున్న ఈ శ్రావణమాసోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదే విధంగా అదనపు టాయ్‌లెట్లు, తోరణాలు, విద్యుద్దీపాలంకరణలు అవసరమైన చోట్ల ముందస్తుగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయం, పరిసరాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన క్యూలైన్లు ఏర్పాటుచేయాలని, అదే విధంగా పరిసరాలను పురిశుభ్రంగా వుంచాలని ఆయన ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఈ రోజులలో భక్తులకు ఉచిత లడ్డులను ప్రసాదంగా ఇవ్వాలని ఆయన అన్నదానం అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సాయంత్రం 7 నుండి 9 వరకు అన్నమాచార్య ప్రాజ్‌క్ట్ వారిచే, 9 నుండి ఉదయం 5 గం||ల వరకు ధర్మప్రచార పరిషత్ చే సంగీత, సాంస్కృతిక, హరికథా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎం.ఎస్ రామారావుగారి మనుమడైన డా||శ్రీనివాస్ గారిచే సుందరకాండ పారాయణం, హనుమంతవైభవంపై హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు అధికారులతో సంప్రదించి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ఇతర పనులను సకాలంలో పూర్తి చేయడానికిగాను, స్ధానిక అధికారుల, సహకారం తీసుకోవాలని ఆయన డిప్యూటీ ఇ.ఓ చెంగల్రాయులును కోరారు.
ఈ సమావేశంలో తితిదే డీపిపి సెక్రటరీ డా||విజయరాఘవాచార్యులు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీరామచంద్రారెడ్డి, డా||మేడసానిమోహన్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.