REVIEW ON AKASHAGANGA, PAPAVINASANAM, AND CRO DEVELOPMENT _ ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం, సీఆర్వో ఆధునీకరణపై ఈఓ స‌మీక్ష‌

Tirumala, 30 May 2025: A review meeting was held on Friday evening at Annamaiah Bhavan in Tirumala by the TTD Executive Officer, Sri J. Syamala Rao, regarding the development of Akashaganga, Papavinasanam, and the Central Reception Office (CRO) in Tirumala.
 
On this occasion, experts presented a PowerPoint Presentation detailing the environmental and spiritual development plans for these areas.
 
The EO stated that the development of Akashaganga and Papavinasanam should be carried out keeping future requirements in mind. He emphasized that strict precautionary measures should be implemented to ensure there is no disruption to traffic in these areas.
 
Later, the EO also reviewed the modernisation plans for the Central Reception Office (CRO) in Tirumala.
 
He advised that steps should be taken to provide state-of-the-art amenities for devotees and suggested that the vacant spaces around the CRO should be utilized to enhance facilities for devotees.
 
Additional EO Sri Ch Venkaiah Chowdary, Chief Engineer Sri Satyanarayana, TTD Urban Development and Designing Expert Sri Ramudu, and other officials participated in the meeting.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  
 
తిరుమ‌ల‌, 2025 మే 30 ; తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం, సీఆర్వో అభివృద్ధి మరియు ఆధునీకరణ పై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు అధ్య‌క్ష‌త‌న తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది.
 
ఈ సంద‌ర్భంగా ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సంబంధిత నిపుణులు తాము రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. 
 
ఈవో మాట్లాడుతూ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ పర్యావరణ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి రూప కల్పన చేయాల‌న్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంత‌రాయం క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన ముందు జాగ్ర‌త్త  చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. 
 
అదే విధంగా తిరుమ‌ల‌లోని కేంద్రీయ విచార‌ణ కార్యాల‌యం (సీఆర్వో) ఆధునీక‌ర‌ణ‌పై కూడా ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అత్యాధునిక సౌక‌ర్యాలు అందించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. సీఆర్వో చుట్టు ప‌క్క‌ల ఉన్న ఖాళీ ప్రాంతాల‌ను కూడా భ‌క్తుల‌కు సౌకర్యవంతంగా తీర్చి దిద్దేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
ఈ సమావేశాల్లో అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌. వెంక‌య్య చౌద‌రి, సీఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణులు శ్రీ రాముడు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 
 
టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.