REVIVAL OF VARIOUS SYSTEMS IN TTD AS PER CM’S INSTRUCTIONS SINCE JUNE LAST_ టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
ALLEGATIONS BY FORMER TTD TRUST BOARD CHIEF ARE BASELESS
UMPTEEN SCANDALS HAPPENED IN GOSHALA FROM MARCH 2021 TO MARCH 2024
MALIGN INTENTION TO DAMAGE THE REPUTATION OF TTD -TTD EO
TIRUPATI, 14 APRIL 2025: Under the instructions of the Honourable CM of Andhra Pradesh Sri N Chandra Babu Naidu, many reforms have been brought in TTD since June last making Tirumala a pilgrim-friendly centre, said TTD EO Sri J Syamala Rao.
Addressing the media persons at the Meeting Hall of the TTD Administrative Building in Tirupati on Monday, the EO refuted the allegations made by former TTD Trust board Chairman Bhumana Karunakara Reddy over the suspicious deaths of 100 cows in TTD Goshala as baseless and made with an intention to malign the reputation of TTD, thereby hurting the sentiments of scores of Hindus spread across the globe.
The EO said there were a lot of corruptive practices carried out in SV Gosala from March 2021 to March 2024 and explained to the media in detail the misappropriation held in the TTD Gosala with the help of video clippings and statistical evidences submitted by the TTD Vigilance Report which were carried out from during that period (March 2021 to March 2024 in SV Dairy Farm of Tirupati).
Some Excerpts:
The EO said on an average nearly 15 cows dies every month following their old age and some diseases as some donors donate such type of bovines to TTD.
In 2024, when 179 cows died in SV Gosala, in the months of January, February and March in 2025 around 43 cows died because of their age factor and diseases while so far in this year, a total of 59 calves were also born.
When the reality is like this, it is unfortunate that the former TTD Board Chief made baseless allegations that TTD has ignored the fodder for the cows, no proper care taken which resulted in deaths of these cattle and many more.
In fact the TTD vigilance report clearly says the negligence shown and the misappropriation took place during the earlier regime in SV Gosala which includes unhygienic and poor quality fodder provided to cattle, illegal floating of fodder tenders, preventing Vigilance Enquiry to suppress the cow deaths and many more.
“If they are really concerned about the cows, then why they have not carried any investigation on all these irregularities during their regime. After the advent of the new Director for SV Goshala all these issues came to the fore and at present we are correcting all the lacunae’’, EO asserted.
Earlier, the TTD EO said, since last June, many reforms were brought in TTD including enhancement of the taste of Annaprasadam and Srivari Prasadams, laddu quality, transparency in Seva, Darshan tickets and Accommodation, getting rid of the brokers, by strengthening IT Wing of TTD, transferring the incompetent person holding the superior post.
Adulterated ghee was procured for making the sacred Srivari Laddu Prasadams during their regime and we have cancelled those suppliers and blacklisted them.
Similarly in the name of donating organic products for making Srivari Annaprasadams, the donor supplied Rs. 5cr worth adulterated organic products and took the benefit of donor pass books for Rs. 25cr against norms as there are no privileges in TTD for kind donations. This also we have cancelled, the EO observed.
Today the devotees are expressing immense satisfaction at the taste and quality of both Annprasadams and laddu prasadams and we are committed to protect the sentiments of multitude of devotees by bringing up more and more pilgrim friendly reforms in TTD”, EO reiterated.
JEO Sri Veerabrahmam, TTD Deputy Forest Officer and In-Charge Director SV Gosala Sri Srinivasulu, VGO Vigilance Sri Ramkumar were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
గోవులకు తల్లిలా భావించి దాణా, సమయానుకూలంగా సఫర్యలు చేస్తున్నాం
గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదు
విజిలెన్స్ నివేదికలో కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా ఇచ్చినట్లు రికార్డులలో నమోదు
గతంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి
గతంలో అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో కల్తీ నెయ్యి వాడినట్లు నివేదికలు చెబుతున్నాయి
టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ శ్రీ బి. కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి
గోవుల సహజ మరణాలు రాజకీయాలకు ఆపాదించడం సరైందికాదు.
మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు గోశాలలో చాలా అక్రమాలు జరిగాయి
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నాం – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు.
తిరుపతి, 2025, ఏప్రిల్ 14: టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని సోమవారం టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టిటిడి గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికలలో తేటతెల్లమవుతోందన్నారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు, మందులు ఎక్కడ తయారు చేశారో లేబుల్ లు కూడా లేని మందులు గోవులకు ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని టిటిడి విజిలెన్స్ నివేదికలలో నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని మాట్లాడారు. తీవ్ర వ్యాధులతో ఉన్న గోవులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు.
టిటిడి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలను నిరాధారమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలను ఈఓ తోసిపుచ్చారు. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో (మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వీ డెయిరీ ఫామ్‌లో) టిటిడి విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లు మరియు గణాంక ఆధారాలను, టిటిడి గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయన్నారు. వాస్తవాలు ఇలా వుంటే టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు శ్రీ బి. కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీ బి. కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన వుంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. టిటిడి గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టిటిడిని , ఇపుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు.
గత జూన్ నుండి టిటిడిలో అన్నప్రసాదం మరియు శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవలలో పారదర్శకత, దర్శన టిక్కెట్లు మరియు వసతి, దళారులను కట్టడిచేయడం, టిటిడి ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టిటిడి ఐటీ విభాగంలో అనర్హుని ఐటీ జీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో, దాతలు రూ.5 కోట్ల విలువైన కల్తీ సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు, దాదాపు రూ.25 కోట్ల వరకు దాతలకు టిటిడిలో పలు ప్రివిలేజేస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు.
ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఇన్-చార్జ్ డైరెక్టర్ ఎస్వీ గోశాల శ్రీ శ్రీనివాసులు, వీజీఓ విజిలెన్స్ శ్రీ రామ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది