Rs.1.20 CRORE WORTH DSNG VAN DONATED TO SVBC _ ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళం
Tirumala, 20 Nov. 20: The Karnataka social welfare minister Sri B Sriramulu on Friday donated a Rs.1.20 crore worth DSNG van to the TTDs SVBC Channel.
After special pujas in front of Srivari temple, Sri Manjunath, a representative of the Karnataka minister handed over the keys of the vehicle to SVBC Managing Director and TTD Additional EO Sri AV Dharma Reddy.
Speaking on the occasion Sri Dharma Reddy said the new DSNG van with state of art technology will go a long way in live telecast of programs at Srivari temple and Sri Padmavati temple on a regular basis.
SVBC CEO Sri Suresh Kumar, Srivari temple DyEO Sri Harindranath and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళం
తిరుమల, 2020 నవంబరు 20: కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బి.శ్రీరాములు టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనాన్ని శుక్రవారం విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి తరఫున ప్రతినిధి శ్రీ మంజునాథ్ వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే సేవలు, ఇతర ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.