Rs.10 LAKH DONATION TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం
Tirumala, June 04, 2026: The family of Sri Kuppala Giridhar Kumar, Convener of Balaji Railway Division Sadhana Samithi, Tirupati, donated Rs.10 lakh to the TTD-run SV Pranadana Trust in the name of his granddaughter, Chi. Kuppala Darshana.
The donation DD was handed over to TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary at Tirumala on Thursday. The Additional EO blessed Chi. Darshana and appreciated the family for supporting TTD’s humanitarian and life-saving medical services.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం
తిరుమల,2026 జూన్ 04: టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
తమ మనవరాలు చి. కుప్పాల దర్శన పేరుతో అందించిన ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి గురువారం సమర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో చి. దర్శనను ఆశీర్వదించి, సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఉదారంగా విరాళం అందించిన శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు.
టీటీడీ చేపడుతున్న వైద్య, మానవతా సేవలకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం మరెందరికో ప్రాణదానంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

