Rs.2.50 CRORE DONATION TO TTD SV PRANADANAM TRUST _ టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం
Tirumala, May 06, 2026: Himadri Foundation from Kolkata, West Bengal, donated Rs.2.50 crore to the TTD SV Pranadanam Trust.
The donation was handed over by Trustee Sri Anurag Choudhary to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala on Wednesday.
The Chairman appreciated the donor’s generosity and said the funds will help provide quality medical services to poor patients.
TTD Board members and officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం
తిరుమల, 2026 మే 06: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి.
బుధవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ శ్రీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు.
ఈ సందర్భంగా దాత శ్రీ అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ సదాశివరావు, శ్రీ జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ శ్రీ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

